Dag Heward-Mills ఉత్తమ అమ్మకాలు కలిగిన “Loyalty and Disloyalty” తో కలిపి, అనేక పుస్తకాల రచయిత. రెండు వేలకు పైగా సంఘములు కలిగిన The Lighthouse Chapel International అనే సంస్థ స్థాపకుడు.Dag Heward-Mills, ఒక అంతర్జాతీయ సువార్తికుడు, అంతర్జాతీయ Healing Jesus కూడికలలో మరియు ప్రపంచమంతటిలోను సమావేశాలలో పరిచర్య చేయుచున్నారు. మరిన్ని వివరాలకు www.daghewardmills.orgను సంప్రదించండి.
-
"ఒక క్రైస్తవునిగా, నీ జీవితములో ఒక ఉత్తమమైన మరియు మధురమైన ప్రభావం పరిశుద్ధాత్మ అయ్యుండాలి. పరిశుద్ధంగా ఉండుటకు నీ గుణం, నీ మనస్సాక్షి, నీ సృజనాత్మకత మరియు నీ సామర్ధ్యత ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావితం అవ్వచ్చో అర్థం చేసుకొనుటకు ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. డగ్ హేవర్డ్-మిల్స్ చే వ్రాయబడిన ఈ అసాధారణ పుస్తకం ద్వారా, మిమ్మును ప్రభావితం చేయుటకు, ప్రేరేపించుటకు మరియు ఎప్పటికి మీ జీవితాన్ని మార్చుటకు మీరు పరిశుద్ధాత్మను అనుమతించవలెను. "
-
యేసు క్రీస్తును నీ దేవునిగా రక్షకునిగా పొందుకొనుట ద్వారా నీవు రక్షింపబడ్డావు! నీవు ఒక తిరిగి జన్మించిన క్రైస్తవునివి మరియు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడినది. నీ ప్రశ్న: “తీసికొనవలసిన తరువాత మెట్టు ఏమిటి?” క్రైస్తవునిగా మారడం ఒక మంచి మెట్టు, కాని అది కేవలం ఆరంభము. నీవు ఒక మంచి, బలమైన క్రైస్తవునిగా మారుటకు బద్ధుడవై యుండాలి. ‘నేను అది ఎలా చేయగలను?’ – ఈ ఉత్తమమైన పుస్తకములో, ఎవరైతే మరణమునకు లేక ఎత్తబడుటకు సిద్ధముగా నున్నాడో అలాంటి ఒక బలమైన క్రైస్తావునిగా ఉండుటకు మరియు నిలచుటకు తీసికొనవలసిన విధానములను నీవు నేర్చుకొందువు.
-
ఈ భూమిపై మానవుని యొక్క జీవితము ఒక యుద్ధము లాంటిది అని మీకు తెలుసా? మనము కావాలనుకున్నా వద్దనుకున్నా మనము యుద్ధములోనే ఉన్నాము. నీ జీవితము ఒక యుద్ధము లాంటిది అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. నీవు మంచి పోరాటమును పోరాడి ఈ యుద్ధాన్ని గెలవాలి. యుద్ధమును గూర్చి వ్రాయబడిన ఈ పుస్తకము నాయకులందరూ తప్పక చదవవలసిన పుస్తకము.
-
సంపద మరియు ఐశ్వర్యమును పరిపాలించు ఆశ్చర్యకరమైన నియమమును యేసుక్రీస్తు బయలుపరచుచున్నాడు. కలిగినవాడు మరింత కలిగియుంటాడు! అది ఎంత అన్యాయముగా అనిపిస్తుంది! అయినప్పటికీ, ప్రతిరోజు మనముందు వ్యక్తమవుచున్న వాస్తవము అది. ఈ పుస్తకము కొద్దిగా అర్థమైన లేఖనమును వివరించుటకు ప్రయత్నిస్తుంది. Dag Heward-Mills యొక్క ఈ నూతన పుస్తకమును నీవు అధ్యయనము చేయుచుండగా నీవు సంపన్నత యొక్క మర్మములలోని గొప్ప మెళకువలు పొందు కొంటావు.
-
ఈ పుస్తకము కుమార్తెల యొక్క గాయములను స్వస్థపరచును! చాలా కాలముగా ఎదురుచూచుచున్న ఈ పుస్తకములో, వారు ఎదుర్కొనే అనేక అసాధ్యమైన పరిస్థితులను అధిగమించుటకు వారికి దేవుని యొక్క జ్ఞానము సహాయపడాలని స్త్రీలు సవాలుచేయబడెను. ప్రత్యేకముగా కుమార్తెలకు వ్రాయబడిన ఈ శక్తివంతమైన నూతన పుస్తకమును నీవు ఆనందించుచుండగా దేవుడు నీ జీవితమును తాకి నిన్ను బలపరచును.
-
ఈ రోజు సహజాతీతము ఉనికిలో నున్నదా? నేను సహజాతీతములో పనిచేయగలనా? ఒకవేళ దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరచగలిగితే, ఆయన ఎందుకు అందరిని స్వస్థపరచడు? నేను ఎలా స్వస్థత అభిషేకము పొందుకొనగలను? Dag Heward-Mills చేత ఈ అద్భుతమైన పుస్తకము యొక్క పేజీల ద్వారా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ మీద వీటికి ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానములను కనుగొనండి.